కూతురి కోసం ఎంపీ స్థానాల తాకట్టు!
ABN , Publish Date - Apr 21 , 2024 | 03:01 AM
తన కూతురు కవిత విడుదల కోసం ఎంపీలను గెలిపించి, బీజేపీకి తాకట్టు పెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వేములవాడలో ఆయన మాట్లాడుతూ
కేసీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం
వేములవాడ టౌన్, ఏప్రిల్ 20: తన కూతురు కవిత విడుదల కోసం ఎంపీలను గెలిపించి, బీజేపీకి తాకట్టు పెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వేములవాడలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని తెలిపారు. మరోమారు అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ చూస్తున్నారని, అదే జరిగితే నియంతృత్వం పెరిగిపోతుందని హెచ్చరించారు. బండి సంజయ్ మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.