ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - May 30 , 2024 | 12:13 AM
ర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న సంఘటన చౌడాపూర్ మండలంలో జరిగింది.

కులకచర్ల, మే 29 : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న సంఘటన చౌడాపూర్ మండలంలో జరిగింది. మీర్‌సాబ్ తండాకు చెందిన రవి(37) దుబాయి వెళ్లి వచ్చాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఈ క్రమంలో అప్పు చేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. బుధవారం ఉదయం కటింగ్ షాపునకు వెళ్లొస్తానని భార్య నీలమ్మకు చెప్పి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. పాత ఇంటి దగ్గర బాతురూంలో చీరతో ఉరి వేసుకు న్నాడు. చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు సంతానం ఉన్నారు.