Share News

Railway Repairs: ఇంటికన్నె వద్ద రెండో ట్రాక్‌ సిద్ధం

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:23 AM

భారీ వర్షాలతో సికింద్రాబాద్‌-విజయవాడ సెక్షన్‌లోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 కి.మీ వద్ద ట్రాక్‌ ధ్వంసమైన ప్రాంతంలో మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి.

Railway Repairs: ఇంటికన్నె వద్ద రెండో ట్రాక్‌ సిద్ధం

  • సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలో.. నెమ్మదిగా నడుస్తున్న రైళ్లు

కేసముద్రం/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 5: భారీ వర్షాలతో సికింద్రాబాద్‌-విజయవాడ సెక్షన్‌లోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 కి.మీ వద్ద ట్రాక్‌ ధ్వంసమైన ప్రాంతంలో మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో డౌన్‌లైన్‌ మరమ్మతులను పూర్తి చేసిన అధికారులు.. ట్రయల్‌రన్‌ పూర్తిచేశారు. దీంతో ఈ ప్రాంతంలో రెండు మార్గాలూ అందుబాటులోకి వచ్చాయి.


ఉదయం నుంచి గోల్కొండ, కృష్ణా, ఈస్ట్‌కోస్ట్‌, అండమాన్‌, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను అప్‌ అండ్‌ డౌన్‌ నడిపించారు. అయితే, మహబూబాబాద్‌-కేసముద్రం మార్గంలో సుమారు 10కి.మీ. మేర 15 ప్రాంతాల్లో ట్రాక్‌లకు మరమ్మతులు చేసినందున ఆయా ప్రాంతాల్లో రైళ్లను 5-30 కి.మీ వేగంతో నడిపిస్తున్నారు. దీంతో ఇటు సికింద్రాబాద్‌కు, అటు విజయవాడకు వెళ్లాల్సిన రైళ్లు కనిష్ఠంగా అరగంట, గరిష్ఠంగా గంటన్నర ఆలస్యంగా చేరుకుంటున్నాయి. శుక్రవారం నుంచి మరికొన్ని రైళ్లను అనుమతించే అవకాశం ంది. కాగా, రేక్‌ల కొరతతో న్యూఢిల్లీ-చైన్నై సెంట్రల్‌, గూడూరు-సికింద్రాబాద్‌, మణుగూరు-సికింద్రాబాద్‌ రైళ్లను గురువారం రద్దు చేసినట్లు రైల్వే ప్రకటించింది.


  • రైల్వే ఏజీఎంగా నీరజ్‌ అగర్వాల్‌

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌(ఏజీఎం)గా నీరజ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. గురువారం సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Sep 06 , 2024 | 04:23 AM