Gaddwal: ఆర్టీసీ బస్సులో ప్రసవం..
ABN , Publish Date - Aug 20 , 2024 | 04:54 AM
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తున్న ఆ గర్భిణికి ఆర్టీసీ బస్సే ఆస్పత్రి అయింది.. కండక్టర్ చొరవతో నర్సు డాక్టరయింది. వెరసి. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
గద్వాల/వనపర్తి టౌన్, ఆగస్టు 19 : ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తున్న ఆ గర్భిణికి ఆర్టీసీ బస్సే ఆస్పత్రి అయింది.. కండక్టర్ చొరవతో నర్సు డాక్టరయింది. వెరసి. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా కొండపల్లికి చెందిన సంధ్య నిండుగర్భిణి, భర్త రామాంజనేయులుతో కలిసి ప్రసవం కోసం వనపర్తిలోని ఆస్పత్రికి వెళ్లేందుకు సోమవారం ఉదయం గద్వాలలో వనపర్తి డిపో బస్సు ఎక్కింది.
పెబ్బేరు దాటిన తర్వాత నాచహల్లినికి రాగానే ఆమెకు పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. స్పందించిన కండక్టర్ భారతి బస్సును రోడ్డు పక్కకు ఆపివేయించింది. బస్సులో ఉన్న ఆలివేలమ్మ అనే నర్సు పురుడుపోయడానికి సిద్ధం అయ్యింది. పురుష ప్రయాణికులను కిందకు దించివేసి గర్భిణికి ప్రసవం చేశారు.
పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. సంధ్యకు సురక్షితంగా కాన్పు చేసిన కండక్టర్ భారతి, నర్సు ఆలివేలమ్మకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు.