Shamshabad: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..
ABN , Publish Date - Jun 06 , 2024 | 05:18 AM
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోవడంతో రెండు గంటలపాటు పడిగాపులు కాసిన ప్రయాణికులు విసుగు చెంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందోళనకు దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు..
రెండు గంటలపాటు ప్రయాణికుల పడిగాపులు
విసుగు చెంది శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళన
శంషాబాద్ రూరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోవడంతో రెండు గంటలపాటు పడిగాపులు కాసిన ప్రయాణికులు విసుగు చెంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందోళనకు దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకా్‌ఫకు ముందు పైౖలెట్లు విమానాన్ని విమానాశ్రయంలోనే నిలిపివేశారు. రెండు గంటలు ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పండి. ఎవరూ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విసుగు చెందిన ప్రయాణికులు విమానాశ్రయంలో అందోళనకు దిగారు.
పైలెట్లు విమానాన్ని మరమ్మతులు చేయడానికి యత్నించారు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రయాణికులను రెండు గంటల తరువాత ఇతర విమానాల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు. సరైన సమాచారం ఇవ్వని ఎయిరిండియా సిబ్బంది, రెండు గంటలపాటు విమానాశ్రయంలోనే పడిగాపులు కాయడానికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఎయిర్‌పోర్టు అధికారులను కోరారు.