Share News

Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:50 AM

మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షల పరిహారం అందిస్తామని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ ప్రకటించారు.

Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు

  • రూ. 25 కోట్లతో మైనార్టీ మహిళా యోజన పథకం

  • మూడు కొత్త పథకాలు ప్రకటించిన టీఎ్‌సఎంఎ్‌ఫసీ

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షల పరిహారం అందిస్తామని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ ప్రకటించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో ఉంటున్న మైనార్టీలకు ప్రత్యేక జీవనోపాధి పథకం కింద పునరావాసాన్ని కల్పిస్తామని చెప్పారు. మైనార్టీలకు సంబంధించి మూడు కొత్త పథకాలను ఆయన ప్రకటించారు. ఇందులో మూసీ భూ నిర్వాసితుల పునరావాస పథకం కూడా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఖాళీ చేయించిన మైనార్టీ కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.


ఇందులో రూ. 1.40 లక్షలు కార్పొరేషన్‌ సబ్సిడీ రుణంగా, రూ. 60 వేలను స్ర్తీనిధి రుణంగా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు ఖాళీ చేయించిన నిర్వాసితుల్లో 138 మైనార్టీ కుటుంబాలను గుర్తించామని, వీరికి ఆర్థికసాయం వెంటనే అందిస్తామన్నారు. అలాగే రూ. 31.64 కోట్లతో మైనార్టీలకు రెండు కొత్త పథకాలు.. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, ఇందిరమ్మ మహిళా శక్తి పథకాలను ఆయన సోమవారం ప్రారంభించారు. మైనార్టీ యోజన పథకంలో భాగంగా రూ. 25 కోట్లతో రాష్ట్రంలోని 5 వేలమంది పేదలకు రూ. 50 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఈ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న మైనార్టీ కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Updated Date - Dec 10 , 2024 | 04:50 AM