Social Media: మంత్రి సీతక్కపై అసభ్య పోస్టులు.. ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Dec 07 , 2024 | 04:36 AM
మంత్రి సీతక్కను అవమానపరిచేలా, అసభ్యకరమైన పోస్టులు పెట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు నిందితలును సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మంత్రి సీతక్కను అవమానపరిచేలా, అసభ్యకరమైన పోస్టులు పెట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు నిందితలును సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారాసిగూడకు చెందిన తొడుపునూరి విజయ్ భానుప్రసాద్, హన్మకొండకు చెందిన గాదె ప్రకాశ్‌లు మంత్రి సీతక్క ప్రతిష్ఠకు భంగం కలిగేలా పోస్టులు పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన డీసీపీ కవిత నేతృత్వంలోనిబృందం... సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.