అమీన్ పీర్ ఉత్సవాల్లో ఏఆర్ రెహమాన్

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:05 PM

కడప జిల్లా: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఆయన పొల్గొన్నారు. అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి వైభవంగా గంధం ఊరేగింపు నిర్వహించారు.

కడప జిల్లా: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఆయన పొల్గొన్నారు. అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి వైభవంగా గంధం ఊరేగింపు నిర్వహించారు. కాగా ఈ ఏడాది కూడా ఏఆర్ రెహమాన్ కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన‌మైన గంధ మహోత్సవం క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. దర్గా పీఠాధిపతి తన శిష్యగణంతో కలిసి కలశాన్ని తీసుకువచ్చారు. ప్రతియేటా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.


కాగా ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు (సోమవారం) జాతీయ ముషాయి గజల్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గజల్‌ గాయకులు పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు రేపు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనన్నారని తెలియవచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ స్టీల్ ఫ్లాంట్‌.. రూ. 3 వందల కోట్ల నష్టం..

వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు

విజయసాయికి ఆర్కే సవాల్..

కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 17 , 2024 | 12:05 PM