సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ABN, Publish Date - Dec 13 , 2024 | 09:29 AM
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి అన్ని రకాల నేరాల నియంత్రణకు ముగ్గురు అనుభవజ్ఞులైన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లోనే చర్యలకు ఉపక్రమించనున్నారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ కోసం ‘ఈగిల్’ విభాగానికి పోలీసు, ఎక్సైజ్ శాఖలు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు త్రిముఖ వ్యూహం సిద్ధం చేశారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోతున్న సైకోలు, సైబర్ నేరగాళ్ల కట్టడికి కఠిన చట్టాలు ప్రయోగించబోతున్నారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి అన్ని రకాల నేరాల నియంత్రణకు ముగ్గురు అనుభవజ్ఞులైన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లోనే చర్యలకు ఉపక్రమించనున్నారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ కోసం ‘ఈగిల్’ విభాగానికి పోలీసు, ఎక్సైజ్ శాఖలు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో జరిపిన సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన సమీక్షించారు. ప్రస్తుతం నేరాల తీరు మారిందని, సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి ప్రజల్ని దోచుకుంటుంటే.. వ్యవస్థీకృత నేరస్థులు గంజాయి సరఫరా చేసి సమాజాన్ని, భావితరాలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.
మరోవైపు నేరగాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అసభ్య భాషతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సమాజంలోని అన్ని వర్గాలనూ మానసికంగా వేధిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరమన్నారు. వీటి కట్టడికి పోలీసులు నడుం బిగించాలని, అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. గడచిన ఐదు నెలల్లో నేరాల కట్టడి తీరు బాగుందని.. టెక్నాలజీని వినియోగించుకుని సమర్థ పోలీసింగ్ నిర్వహిస్తే నేరస్థులు తోక ముడుస్తారని చెప్పారు. సోషల్ మీడియాలో బూతులను అదుపు చేశారని..ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని.. ఇందుకు పోలీసులను అభినందిస్తున్నానని అన్నారు. ‘మద్యం అక్రమాలపై సీఐడీ, ఇసుక దోపిడీపై ఏసీబీ విచారణ జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా ఆగాలి. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో నిఘా పెట్టాలి. సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేసి ఒక్క టన్ను కూడా ఎగుమతి కాకుండా ఆపాలి’ అని ఆదేశాలిచ్చారు. ఇందులో ఏ పార్టీ వ్యక్తులున్నా చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 13 , 2024 | 09:29 AM