Raghurama Raju: దుర్యోధన ఏకపాత్రాభినయంతో అదరగొట్టిన రఘురామరాజు
ABN, Publish Date - Mar 20 , 2025 | 08:12 PM
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలను స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శించారు.

అమరావతి: విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇవాళ(గురువారం) సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలను స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, తదితరులు హాజరయ్యారు. క్రీడా, సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేయనున్నారు.
దుర్యోధనుడు వేషధారణలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఆకట్టుకున్నారు. ఏమంటివి ఏమంటివి అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్‌తో రఘురామకృష్ణంరాజు ఏకాపాత్రాభినయం చేశారు. రఘురామకృష్ణంరాజు డైలాగ్స్‌కు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సహా సభ్యులంతా చప్పట్లు కొట్టారు. కేరింతలతో ప్రాంగణం మార్మోగింది. తమ తమ స్థానాల్లో నిలబడి రఘురామను మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 20 , 2025 | 08:18 PM