శక్తి యాప్‌తో మహిళలకు రక్షణ
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:27 AM
శక్తి యాప్‌తో మహిళ లు, విద్యార్థినులకు రక్షణ ఉంటుందని శక్తి బృందాలు తెలిపాయి.

ఒక్క రోజులోనే 300 మందితో రిజిస్ట్రేషన్
శ్రీకాకుళం క్రైం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): శక్తి యాప్‌తో మహిళ లు, విద్యార్థినులకు రక్షణ ఉంటుందని శక్తి బృందాలు తెలిపాయి. ఈ మేరకు బుధవారం శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యం, ఆత్మరక్షణలో శిక్షణపై డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. మునసబుపేటలోని గురజాడ, శ్రీకాకుళంలోని ప్ర భుత్వ మహిళా కళాశాల, అరసవిల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ తోపాటు రిమ్స్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు యాప్ ఆవశ్య కతపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ చేతిలో శక్తి యాప్ ఒక ఆయుధంగా నిలుస్తుం దని బృందాలు తెలిపాయి. కళాశాలల్లో మహిళ ల భద్రత కోసం ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌ల ను మహిళా పోలీసు స్టేషన్ ఎస్‌ఐ చంద్రకళ పరిశీలించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా బుధవా రం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 300 మంది విద్యార్థినులతో శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌ఐలు రవి, వాసుదేవరావు, ఏఎస్‌ఐ అరుణ, శక్తి బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.