MLA ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:25 AM
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రీవెన్సలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

పుట్టపర్తి రూరల్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రీవెన్సలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది మాసాల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, పలు ప్రజా సమస్యలను పరిష్కరించిందని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పీఆర్ ఆర్‌డబ్ల్యూఎస్, హెల్త్, పోలీసు, ఇరిగేషన, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.