ఆ ఒక్క మాటతో కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ ..

ABN, Publish Date - Sep 18 , 2024 | 08:05 AM

హైదరాబాద్: పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్‌ఎస్‌లో కాంట్రవర్సియల్‌ ఎమ్మెల్యేగా పేరుంది. ఆయన లేవనెత్తిన ఓ ఇష్యూ ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమైంది. ఒకే ఒక్క మాట.. కారు పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని టాక్‌. పార్టీ నాయకత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తెచ్చిపెట్టింది.

హైదరాబాద్: పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్‌ఎస్‌లో కాంట్రవర్సియల్‌ ఎమ్మెల్యేగా పేరుంది. ఆయన లేవనెత్తిన ఓ ఇష్యూ ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమైంది. ఒకే ఒక్క మాట.. కారు పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని టాక్‌. పార్టీ నాయకత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తెచ్చిపెట్టింది. ఆ పొలిటికల్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌ కాంట్రవర్సియల్‌ కామెంట్స్‌.. గులాబీ పార్టీకి జనం అండగా ఉన్న చోట అగ్గి రాజేయగా.. హస్తం పార్టీకి అస్త్రాన్ని అందించింది. కౌశిక్‌రెడ్డి నోటి వెంట వచ్చిన ఆంధ్రా మాటతో హైదరాబాద్ బ్రాండ్‌కు.. బ్యాండ్ పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో డిఫెన్స్‌లో పడిన కారు పార్టీ పెద్దలు క్లాస్ పీకడంతో.. కౌశిక్‌రెడ్డి ప్రస్తుతానికి కామ్‌ అయ్యారు. కానీ పదేపదే చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని పార్టీలో ఇంటర్నల్ టాక్‌.


ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో కొరకరాని కొయ్యగా మారారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆ పార్టీ పెద్దలు ఫైర్‌ అవుతున్నారు. పీఏసీ చైర్మన్‌ అరెకపూడి గాంధీపై.. కౌశిక్‌రెడ్డి కాంట్రవర్సిల్‌ కామెంట్స్‌ చేశారు. ఆంధ్రా నుంచి బతకడానికి వచ్చారంటూ ఘాటు వ్యాఖ్యలు.. కృష్ణా జిల్లా నుంచి బతకడానికి వచ్చి సవాల్‌ చేస్తావా.. అంటూ కౌశిక్‌ ప్రశ్నించారు. దీంతో సెటిలర్స్‌లో బీఆర్‌ఎస్‌ సానుభూతి కోల్పోయింది. భవిష్యత్ ఎన్నికలలో నష్టం తప్పదని బీఆర్ఎస్ అగ్రనేతలు టెన్షన్ పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గత పాలకుల నిర్లక్ష్యం.. ఏపీ ప్రజలకు శాపం..

ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీ

తెలంగాణ ఓ పిడికిలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 18 , 2024 | 08:05 AM