అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..
ABN, Publish Date - Jun 03 , 2024 | 08:14 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికే అధికారం దక్కబోతోందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్‌లో పేర్కొంది. లోక్ సభ స్థానాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను శనివారం విడుదల చేసిన ఈ సంస్థ.. అసెంబ్లీ సీట్లపై అంచనాలను ఆదివారం విడుదల చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికే అధికారం దక్కబోతోందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్‌లో పేర్కొంది. లోక్ సభ స్థానాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను శనివారం విడుదల చేసిన ఈ సంస్థ.. అసెంబ్లీ సీట్లపై అంచనాలను ఆదివారం విడుదల చేసింది. దీని ప్రకారం 175 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ కూటమికి 98-120 వరకు లభించే అవకాశముంది. గత ఎన్నికల్లో 151 చోట్ల గెలిచిన వైసీపీ 55-75 సీట్లకే పరిమితమవుతుంది. కూటమిలో పార్టీల వారీగా విడిగా చూస్తే టీడీపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. దానికి 78-96 సీట్లు, జనసేనకు 16-18 సీట్లు, బీజేపీకి 4-6 సీట్లు దక్కుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అధికారులకు సీఈసీ కీలక ఆదేశాలు..
ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 03 , 2024 | 08:15 AM