ABN Big Debate: యూత్ మొత్తం మోదీ వెనుక ఉన్నారనేది అవాస్తవం: కొప్పుల రాజు

ABN, Publish Date - Apr 29 , 2024 | 08:25 PM

దేశంలోని యువత ప్రధాని మోదీ వెనుక ఉన్నారనే మాటలో వాస్తవం లేదని, యువతలో మార్పు వచ్చిందని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు పేర్కొన్నారు. తమ సమస్యలపై రాహుల్ గాంధీ ఒక్కరే మాట్లాడుతున్నారన్న విషయాన్ని...

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

దేశంలోని యువత ప్రధాని మోదీ (PM Modi) వెనుక ఉన్నారనే మాటలో వాస్తవం లేదని, యువతలో మార్పు వచ్చిందని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు (Koppula Raju) పేర్కొన్నారు. తమ సమస్యలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఒక్కరే మాట్లాడుతున్నారన్న విషయాన్ని వాళ్లు గ్రహిస్తున్నారని చెప్పారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యువత మొత్తం ఇంకా మోదీ వెనకాలే ఉన్నారు కదా’ అని రాధాకృష్ణ చెప్పిన మాటకు కొప్పుల రాజు బదులిస్తూ.. గతంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్, ప్రొపగండ ప్రభావం కారణంగా మోదీనే మంచి నాయకుడు అనే అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చని అన్నారు. కానీ.. ఇప్పుడు అందరిలోనూ మార్పు వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా.. యువత రాహుల్ గాంధీని ఫాలో అవుతున్నారని అభిప్రాయపడ్డారు.


నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఇదే: కొప్పుల రాజు

రాహుల్ గాంధీ ఒక్కరే తమ యూత్ సమస్యలపై, నిరుద్యోగంపై మాట్లాడుతున్నారని యువత అర్థం చేసుకుంటున్నారని కొప్పుల రాజు అన్నారు. అంతేకాదు.. విద్యకు సంబంధించిన అంశాలపై రాహుల్ ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, సమాజంలోని అసమానతలపై మాట్లాడుతున్నారని యువత గమనిస్తున్నారన్నారు. అఫ్‌కోర్స్.. ఈరోజుల్లోనూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్, ప్రొపగండ ప్రభావం ఉన్నప్పటికీ.. మునపటిలాగా వాటికి లొంగడం లేదన్నారు. దేశంలోని యువతతో పాటు ప్రజల్లోనూ చాలా మార్పు వచ్చిందని నొక్కి చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు దేశ సమస్యల్ని పట్టించుకోకపోవడం, ప్రజలు గుండె చప్పుడు వినకపోవడం, ఒక్క ప్రెస్ కాన్ఫిరెన్స్ కూడా నిర్వహించకపోవడం, తరచూ విదేశీ టూర్లకు వెళ్లడం వంటివి ప్రధానిమంత్రిలో ఉండాల్సిన లక్షణాలు కావని ప్రజలు అర్థం చేసుకున్నారని కొప్పుల రాజు చెప్పుకొచ్చారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated at - Apr 29 , 2024 | 08:25 PM