Share News

నీటికష్టాలకు చెల్లుచీటి..!

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:09 AM

పట్ణణ ప్రజలకు కూటమి ప్రభుత్వం గొప్ప బహుమతినిచ్చింది. మంచినీటి పథకం నిర్మాణానికి రూ.89కోట్లు కేటాయించింది. నిరంతరాయంగా స్వచ్ఛమైన మంచినీటిని అందించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచనుంది.

నీటికష్టాలకు చెల్లుచీటి..!

పట్ణణ ప్రజలకు కూటమి ప్రభుత్వం గొప్ప బహుమతినిచ్చింది. మంచినీటి పథకం నిర్మాణానికి రూ.89కోట్లు కేటాయించింది. నిరంతరాయంగా స్వచ్ఛమైన మంచినీటిని అందించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచనుంది. ఆర్‌వో వాటర్‌ తరహా శుద్ధి చేయబడిన నీటిని ప్రతి గడపకూ నడిపేందుకు చర్యలు చేపట్టింది. వారానికి రెండు పర్యాయాలు మాత్రమే మంచినీరు అందుకొనే ప్రజలకు నిత్యం తలకు 135 లీటర్ల నీటిని అందించనున్నారు. పట్టణ జనాభా శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 2050 నాటి జనాభాను అంచనా వేసుకొని ఈ పథకాన్ని డిజైన్‌ చేశారు. అభివృద్ధి చెందిన నగరాలకు కూడా లేని సౌకర్యం పట్టణ ప్రజలకు చేరువ కానుంది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పట్టుదల, కమిషనర్‌ రమణబాబు, ఏఈ ఫణిశ్రీనివాస్‌ సమయస్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్‌ నందిగామకు వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

- ఆంధ్రజ్యోతి-నందిగామ

నందిగామ పట్టణం.. పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా మారినా 3 దశాబ్దాల నాటి మంచినీటి పథకాలే నేటికీ ఆధారం. జనాభా మాత్రం రెట్టింపైంది. ప ట్టణ జనాభాతో పాటు నిత్యం వేలాది మంది అనేక పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. దీంతో మంచినీటి వినియోగం భారీగా పెరిగింది. కీసర, ము నేరు, కాట్రేనిపల్లి పథకాల నుంచి వచ్చే కొద్దిపాటి నీటి ని ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తున్నారు. దీంతో వా రానికి రెండ్రోజులు మాత్రమే నీటిని ఇవ్వగలుగుతున్నారు. తలకు 135 లీటర్లు ఇవ్వాల్సి ఉండగా, సరాసరి 50 లీటర్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీటి ప థకాలు, పైప్‌లైన్లు సామర్థ్యాన్ని కోల్పోతూ నిత్యం మరమ్మతులకు గురౌతున్నాయి. పట్టణ జనాభాకు నిత్యం 7.6 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంది. కానీ కేవలం 3లక్షల లీటర్ల నీరు మాత్రమే వస్తున్నాయి. ఇ ప్పుడు ఏఐఐబీ ప్రాజెక్ట్‌ పూర్తయితే పట్టణ అవసరానికి మించి 10 లక్షల లీటర్ల శుద్ది చేసిన నీరు అందనుంది.

చంద్రబాబు దార్శినికత

శుద్ధి చేయబడిన నీరు ప్రజలకు అందించాలన్న ఆ లోచనతో 2014-19 మధ్య పలు మునిసిపాలిటీలకు అ ప్పటి టీడీపీ ప్రభుత్వం ఆసియా పెట్టుబడులు, మౌ లిక వసతుల బ్యాంక్‌ (ఏఐఐబీ) ద్వారా భారీ మంచినీ టి పథకాలు నిర్మించ తలపెట్టారు. అందుకు అనుగుణంగా డీపీఆర్‌లు తయారుచేసి పంపారు. ఒప్పందా లు, అనుమతుల సమయంలో ఎన్నికల కోడ్‌ రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఈ పథకాలకు గృహణం పట్టింది. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ని ర్మాణాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం చంద్రబాబు మ ళ్లీ ముఖ్యమంత్రి కావడంతో మరోమారు ఈ పథకంపై ఎమ్మెల్యే సౌమ్య దృష్టి మళ్లింది. కొత్తగా డీపీఆర్‌ పంప గా అన్ని నిధులివ్వలేమని, రివైజడ్‌ డీపీఆర్‌ పంపాలని బ్యాంక్‌ అధికారులు కోరారు. దీంతో రివైజ్‌డ్‌ డీపీఆర్‌ తయారీలో స్థానిక ఎమ్మెల్యే పట్టుదల, అధికారుల నైపుణ్యం చూపించడంతో బ్యాంక్‌ అధికారులు సంతృ ప్తి చెంది ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.89కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రాజెక్ట్‌ వివరాలు

కృష్ణానదిలో అత్యంత లోతైన ప్రదేశం గుడిమెట్ల వ ద్ద ఈ పథకం నిర్మాణానికి నిర్ణయించి ఇన్‌టెక్‌వెల్‌ ని ర్మాణం చేస్తారు. మండు వేసవిలోనూ ఇక్కడ భారీగా నీటి నిల్వలుంటాయి. అక్కడ నుంచి 10 ఎల్‌ఎండీ నీ టిని నందిగామ శివారు అనాసాగరంలో ఏర్పాటు చేసే 10 ఎంఎల్‌డి సామర్థ్యం గల మంచినీటి శుద్ధి పరిశ్రమ వద్దకు చేరుకుంటాయి. అక్కడ శుద్ధి చేసిన నీరు అనాసాగరం వద్ద వెయ్యి కిలో లీటర్ల్ల రిజర్వాయర్‌కు, ఉమా కాలనీ వద్ద 800 కిలోలీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్‌కు, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ వద్ద ఉన్న 700 కిలోలీటర్ల రిజర్వాయర్‌కు సరఫరా అవుతుంది. వాటి నుంచి నేరుగా ప్రతి ఇంటికీ తాగునీరు చేరనుంది.

పటిష్ఠమైన పైప్‌లైన్‌ వ్యవస్థ

పట్టణంలో కేవలం 600 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌లు ఉన్నాయి. వాటి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడంతో వాటి స్థానంలో కొత్త పటిష్టమైన పైప్‌లైన్‌ నిర్మాణం జరగనుంది. అంతేకాక కొత్తగా 106 కిలోమీటర్ల పైప్‌లైన్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణంలోని 14 వేల నివాస గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. రానున్న 5 దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించాల్సిన ఈ పథకం నిర్మాణ పనులను సమర్థత ఉన్న సంస్థకు అప్పగించాల్సి ఉంది. అనుభవం లేని రాజకీయ నేతలకు పనులు అప్పగించకుండా నాణ్యతా ప్రమాణాలపై అవగాహన, అధునాతన నిర్మాణ పరికరాలున్న కంపెనీలకు అప్పగించాలి.

Updated Date - Mar 27 , 2025 | 01:09 AM