Best ఉత్తమ ఆయుస్మాన మందిర్
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:29 AM
మండలంలోని మర్రిమాకులపల్లి (చిన్నచిగుళ్లరేవు) ఆయుస్మాన మందిరానికి ఉత్తమ అవార్డు దక్కింది.

తాడిమర్రి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని మర్రిమాకులపల్లి (చిన్నచిగుళ్లరేవు) ఆయుస్మాన మందిరానికి ఉత్తమ అవార్డు దక్కింది. గతనెల 23న జాతీయ ఆరోగ్య మిషన బృందం సమన్వయకర్త సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మర్రిమాకులపల్లిలో అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరాతీశారు. పనితీరు, సేవల ఆధారంగా 92.12 శాతం మార్కులు రావడంతో అవార్డుకు ఎంపిక చేసినట్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రేణుక, హర్షవర్దన తెలియజేశారు. ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.