GOD: వాసవీమాతకు ఘనంగా వస్త్రార్చన
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:51 AM
ఫాల్గుణ బహుళ ఏకాదశిని పురస్క రించుకుని మంగళవారం సాయంత్రం కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి నూతన వస్త్రార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. దాదాపు వెయ్యి చీరలను అమ్మవారి ఎదుట ఉంచి పూజలు చేశారు.

అనంతపురం కల్చరల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఫాల్గుణ బహుళ ఏకాదశిని పురస్క రించుకుని మంగళవారం సాయంత్రం కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి నూతన వస్త్రార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. దాదాపు వెయ్యి చీరలను అమ్మవారి ఎదుట ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులు సామూహిక సహస్ర నామార్చన, కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో వాసవీ మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలాదేవి, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
మరిన్ని అనంతపురం వార్తల కోసం....