RAYDURG YCP: వైసీపీలో అలజడి.!
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:55 PM
వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. పట్టణానికి చెందిన నలుగురు కౌన్సిలర్లతోపాటు ఇద్దరు సీనియర్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దుమారం రేపింది. రాయదుర్గం వైసీపీలో ఇటీవల అసమ్మతి బ లపడుతూ వస్తోంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా రెం డువర్గాలుగా విడిపోయి, తన్నుకునే స్థాయికి చేరారు.

రాయదుర్గంలో నలుగురు కౌన్సిలర్లు, ఇద్దరు నాయకుల సస్పెన్షన
మున్సిపల్ చైర్‌పర్సనను గద్దె దింపడమే లక్ష్యంగా పావులు
రాయదుర్గం, మార్చి14(ఆంధ్రజ్యోతి): వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. పట్టణానికి చెందిన నలుగురు కౌన్సిలర్లతోపాటు ఇద్దరు సీనియర్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దుమారం రేపింది. రాయదుర్గం వైసీపీలో ఇటీవల అసమ్మతి బ లపడుతూ వస్తోంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా రెం డువర్గాలుగా విడిపోయి, తన్నుకునే స్థాయికి చేరారు. దీనిని సీరియ్‌సగా పరిగణించిన అధిష్టానం సస్పెన్షనతో క్రమశిక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. మరికొందరిని త్వరలోనే సస్పెండ్ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాయదుర్గం మున్సిపల్ వైస్ చైర్మెన శ్రీనివాసులుయాదవ్, వలి, కౌన్సిలర్లు డిష్ గోవిందు, శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేశారు. డీ.హీరేహాళ్ మండల మాజీ కన్వీనర్ వన్నూరుస్వామి, రాళ్ల తిమ్మారెడ్డిని కూడా సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. శాసనసభ ఎన్నికల అనంతరం నివురుగప్పిన నిప్పు లా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. నాలుగేళ్లపాటు మున్సిపల్ చైర్‌పర్సనగా బాధ్యతలు నిర్వర్తించిన పొరాళ్ల శిల్పను గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. దీని కోసం నాలుగు నెలలుగా తీవ్ర కసరత్తు సాగుతోంది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తూ వస్తున్నారు. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో 14 మంది సభ్యులు జట్టుగా ఏర్పడి కోరంలేకుండా చేసి చైర్‌పర్సనను గద్దె దింపే ప్రయత్నానికి పూనుకున్నారు. రెండు వర్గాలుగా ఏర్పడి వాగ్వాదం చేసుకోవడంతోపాటు తన్నుకునే స్థాయికి చేరా రు. దీంతో వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. మున్సిపల్ కౌన్సిల్‌లో 32 మంది సభ్యుల్లో 29 మంది వైసీపీకి చెందిన వారున్నా రు. వీరిలో 14 మందిదాకా తిరుగుబాటు చేస్తున్నారు. అధిష్టానం బుజ్జగించే చర్యలు చేపట్టినా వారు వెనక్కి తగ్గలేదు. పైగా ము న్సిపల్ చైర్‌పర్సనగా ఉన్న శిల్పను గద్దె దింపడానికి వైస్ చైర్మన వలి.. కొందరికి సొమ్ము చెల్లించి, తన వైపు తిప్పుకుంటున్నట్లు చర్చలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు వర్గాలుగా ఏర్పడి, ఎవరికి వారు ఎత్తుగడలు వేస్తున్నారు. డీ.హీరేహాళ్ మం డల మాజీ కన్వీనర్ వన్నూరుస్వామితోపాటు సీనియర్ నాయకుడు రాళ్ల తిమ్మారెడ్డి.. బీజేపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ చర్యలు తీసుకుంది. అసమ్మతి వర్గం.. వైసీ పీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకి స్తూ వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సస్పెన్షన ఎలాంటి పరిణామాలకు తావిస్తుందోనన్న చర్చలు వినిపిస్తున్నాయి.
రాజీనామాకు సిద్ధంగా 8 మంది కౌన్సిలర్లు
తమపై చర్యలు తీసుకోవడంతో వైసీపీకి తీవ్ర నష్టం తప్పదని బహిష్కృత కౌన్సిలర్లు తెలిపారు. వైస్ చైర్మెన వలి, శ్రీనివాసయాదవ్, కౌన్సిలర్లు డిష్ గోవిందు, శ్రీనివాసరెడ్డి, వన్నూరుస్వామి విలేకరులతో మాట్లాడారు. మరికొందరు కౌన్సిలర్లు, నాయకులు కూడా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. సస్పెన్షన్లతో పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. ఇంకా ఎనిమిది మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. రాజీనామాకు సంబంధించి సంతకాలు చేసిన లేఖను చూపించారు. మున్సిపల్ చైర్‌పర్సనను మార్చాలని 14 మంది కౌన్సిలర్లు.. సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డిని పలుమార్లు కోరామన్నారు. ప్రయోజనం లేదన్నారు. మెట్టు గోవిందరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సనను గద్దె దింపడం ఖాయమనీ, అవిశ్వాసం పెట్టి తీరుతామని వారు స్పష్టం చేశారు.