Share News

APTF వ్యాధిగ్రస్తులకు మినహాయింపు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:45 PM

పదోతరగతి మూల్యాంకనం నుంచి దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడుతున్న, 60 సంవత్సరాల పైబడిన వారికి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డీఈఓ కిష్టప్పకు వినతిపత్రాన్ని గురువారం అందజేశారు.

APTF వ్యాధిగ్రస్తులకు మినహాయింపు ఇవ్వాలి
డీఈఓకు వినతిపత్రం ఇస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

కొత్తచెరువు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పదోతరగతి మూల్యాంకనం నుంచి దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడుతున్న, 60 సంవత్సరాల పైబడిన వారికి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డీఈఓ కిష్టప్పకు వినతిపత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్బంగా ఆ నాయకులు మాట్లాడుతూ.. గత ఏడాది నుంచి ఉపాధ్యాయ సంఘాలతో కో-ఆర్డీనేషన మీటింగ్‌ విద్యాశాఖ అధికారులు నిర్వహించలేదన్నారు. ఆర్‌జేడీ రెండు నెలలకు ఒకసారి సంఘాలతో కో ఆర్డీనేషన మీటింగ్‌ నిర్వహించాలని గతంలోనే ఆదేశించారన్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్క మీటింగ్‌ కూడా నిర్వహించలేదన్నారు. ఇకనుంచైనా రెండు నెలలకొసారి సంఘాలతో కో ఆర్డీనేషన మీటింగ్‌ నిర్వహించాలన్నారు. కదిరి ప్రాంతంలో సీఎస్‌, డీఓలను నియమించే క్రమంలో చాలా అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు ఆర్‌చంద్ర, భాస్కర్‌, చెన్నకేశవ, నాయుడు, వేణు ఉన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:45 PM