Share News

eKYC ఈకేవైసీ గడువు పొడిగించండి : సీపీఐ

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:22 AM

రేషన కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి గడువును ప్రభుత్వం మరోనెల పొడిగించాలని సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు కోరారు.

eKYC  ఈకేవైసీ గడువు పొడిగించండి : సీపీఐ
వినతిపత్రం ఇస్తున్న సీపీఐ నాయకులు

ముదిగుబ్బ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రేషన కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి గడువును ప్రభుత్వం మరోనెల పొడిగించాలని సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేసిన ఆయన మాట్లాడారు. రేషన కార్డుదారులు ఈ నెల లోపల ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో కార్డుదారులు సకాలంలో ఈకేవైసీ చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రేషన కార్డుదారులు ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాల్లో ఉంటున్న కూలీలు, వివిధ కాలేజీల్లో చదువుతున్న విధ్యార్ధులు సకాలంలో తమ స్వగ్రామాలకు వచ్చి ఈకేవైసీ చేయించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. మరో నెల పాటు గడువును పెంచి రేషన కార్డుదారులందరు ఈకేవైసీ చేయించుకునే అవకాశం కల్పించాలని కోరారు. లేని పక్షంలో రేషన కార్డుదారులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట సీపీఐ నాయకులు తిప్పయ్య, డాబా రామకృష్ణ, గంగిరెడ్డిపల్లి నాయుడు, వెంకటరాముడు, ఈశ్వర నాయక్‌, ఆటో కృష్ణ ఉన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 12:22 AM