Share News

Tadipatri: తాడిపత్రిలో ఉద్రిక్తత

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:17 AM

అనుమతి పొందిన ప్లాన్‌ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు శుక్రవారం కూల్చివేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అధికారులకు, ఫయాజ్‌బాషాకు మధ్య వాగ్వాదం జరిగింది.

Tadipatri: తాడిపత్రిలో ఉద్రిక్తత

వైసీపీ నేత ఇంటి నిర్మాణంపై వివాదం

తాడిపత్రి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఫయాజ్‌బాషా చేపట్టిన ఇంటి నిర్మాణం వివాదానికి దారితీసింది. అనుమతి పొందిన ప్లాన్‌ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు శుక్రవారం కూల్చివేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అధికారులకు, ఫయాజ్‌బాషాకు మధ్య వాగ్వాదం జరిగింది. తనకు అన్ని అనుమతులు ఉన్నాయని, కోర్టును కూడా ఆశ్రయించానని ఫయాజ్‌ తెలిపారు. పైఅంతస్తుకు మాత్రమే అనుమతి లేదని, అలాంటప్పుడు మొత్తం ఇంటిని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన పత్రాలను చూపించారు. ఈ క్రమంలో తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటమాట పెరగడంతో ఫయాజ్‌ బాషా ఇంటిపైకి జేసీ అనుచరులు రాళ్ల వర్షం కురిపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఫయాజ్‌బాషాను పోలీసులు స్టేషన్‌కు తరలించి, జేసీని ఆయన అనుచరులను అక్కడ నుంచి పంపించేశారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:17 AM