Share News

Eluru POCSO Court: హత్యాచారం కేసులో నలుగురికి జీవిత ఖైదు

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:15 AM

ప్రేమ జంటపై నలుగురు ఆగంతకులు దాడిచేశారు! యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆరేళ్ల క్రితం నాటి ఈ కేసులో నలుగురు ముద్దాయిలకు ఏలూరు పోక్సో కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పుచెప్పింది. జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ కథనం ప్రకారం..

Eluru POCSO Court: హత్యాచారం కేసులో నలుగురికి జీవిత ఖైదు

ఏలూరు పోక్సో కోర్టు సంచలన తీర్పు

ఏలూరు క్రైం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రేమ జంటపై నలుగురు ఆగంతకులు దాడిచేశారు! యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆరేళ్ల క్రితం నాటి ఈ కేసులో నలుగురు ముద్దాయిలకు ఏలూరు పోక్సో కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పుచెప్పింది. జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ కథనం ప్రకారం.. 2019 ఫిబ్రవరి 24న భీమడోలు మండలానికి చెందిన ప్రేమజంట కామవరపుకోట మండలం జీలకర్రగూడెం సమీపంలోని గుంటుపల్లి గుహలకు వెళ్లింది. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం మాధవరానికి చెందిన పోతునూరి రాజు అలియాస్‌ అంకమరావు(28), ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల సోమయ్య(22), తుపాకుల గంగయ్య అలియాస్‌ గంగరాజు (20), మైలవరం మండలం ముడిచెర్ల కృష్ణారానికి చెందిన కొమరగిరి నాగరాజు(22) పక్షులు, జంతువులను వేటాడడానికి వచ్చి.. ఈ జంటపై దాడికి తెగబడ్డారు. యువతిపై అత్యాచారం చేసి, హత్యచేశారు.


ప్రేమికుడిని చావబాది అతడి సెల్‌ఫోన్‌, నగదు అపహరించుకుపోయారు. ఈ దారుణంపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. నాటినుంచి ఏలూరులోని పోక్సో కోర్టులో విచారణ సాగింది. విచారణ పూర్తవడంతో శుక్రవారం తుదితీర్పు వెలువడింది. హంతకులకు రెండు జీవిత ఖైదులు, ఒక్కొక్క సెక్షన్‌లో రూ.పదివేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి ఉమాసునంద తీర్పు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులకు రూ.3లక్షల పరిహారం ఇవ్వాలని, గాయపడిన నవీన్‌ కుమార్‌కు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని ఎస్పీ చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:15 AM