Paritala Sriram మంత్రి ఆనంను కలిసిన పరిటాల శ్రీరామ్
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:35 AM
రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డిని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అమరావతిలోని మంత్రి చాంబర్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ధర్మవరం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డిని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అమరావతిలోని మంత్రి చాంబర్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శివరాత్రి ఉత్సవాలను కాటకోటేశ్వరస్వామి క్షేత్రంలో ఎలాంటి గొడవలూ లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రిని సన్మానించారు. ఆయన వెంట కాటకోటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు బొట్టుకిష్ట, టీడీపీ నాయకులు జింకల రాజన్న, సాయినాథ్ ఉన్నారు. అనంతరం అర్చకుడు, టీడీపీ నాయకులు మంత్రి సత్యకుమార్‌నూ సన్మానించారు.