Share News

flats ప్లంబర్ల సమస్య కలెక్టర్‌ దృష్టికి..

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:34 AM

పట్టణంలోని 650-2 స ర్వేనెంబర్‌లో ఇళ్ల పట్టాలు అనర్హుల పాలైన విషయం .. జరి గిన అవినీతి.. అర్హులైన ఎలకి్ట్రకల్‌ ప్లంబర్లకు జరిగిన అన్యా యాన్ని ఆ సంఘం నాయకులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

flats ప్లంబర్ల సమస్య కలెక్టర్‌ దృష్టికి..
కలెక్టరేట్‌లో ఎలకి్ట్రకల్స్‌, ప్లంబర్ల సంఘం నాయకులు

ధర్మవరం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 650-2 స ర్వేనెంబర్‌లో ఇళ్ల పట్టాలు అనర్హుల పాలైన విషయం .. జరి గిన అవినీతి.. అర్హులైన ఎలకి్ట్రకల్‌ ప్లంబర్లకు జరిగిన అన్యా యాన్ని ఆ సంఘం నాయకులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ టీఎస్‌ చేతనకు ఆ సంఘం నాయకులు సురేంద్ర, రాజు, చంద్రశేఖర్‌రెడ్డి, లతీఫ్‌ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనిపై విచారణ చేసి.. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

భూకబ్జాదారులను అరెస్టు చేయాలి

పట్టణంలోని సర్వేనెంబరు 650-2 స్థలాన్ని ప్రభుత్వం ప్లంబర్స్‌కు కేటాయించిందని, ఆ భూమిని కబ్జా చేసిన వారిని అరెస్టు చేయాలని సీపీఐ నాయకులు వనటౌన సీఐ నాగేంద్రప్రసాద్‌ను శుక్రవారం కోరారు. వారిపై చట్టారీత్యా కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సీపీఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్‌, ప్లంబర్స్‌ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:34 AM