WHIP KALAVA: బెస్తల సమస్యలు పరిష్కరిస్తా
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:12 AM
బెస్త కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బెస్తకులస్థుల ఆరాధ్యదైవం అంబిగర చౌడయ్య జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

కణేకల్లు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): బెస్త కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బెస్తకులస్థుల ఆరాధ్యదైవం అంబిగర చౌడయ్య జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కర్ణాటకలో జన్మించిన అంబిగర చౌడయ్య తన పాటలు, కీర్తనలతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంచి సన్మార్గం వైపు నడిపించారన్నారు. అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ర్యాలీలో పాల్గొన్న ఆయన చౌడయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విప్ కాలవకు శాలువ, పూలమాలలతో కులస్థులు సన్మానించారు. అంతకు ముందు చిక్కణ్ణేశ్వరదేవాలయం నుంచి ర్యాలీగా వేదవతి హగరికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గంగాజలంతో అంబిగర చౌడయ్య చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. వన్నూరుస్వామి, ముక్కన్న, గోవిందు, పురుషోత్తం, నాగరాజు, కుమార్, సూరి, రాము, టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్, వేలూరు మరియప్ప, చంద్రశేఖర్‌గుప్తా, బీటీ రమేష్, షేక్‌ముజ్జు, మాబుసాబ్, చాంద్‌బాషా, నాగరాజు, అనిల్, జిలాన, తిప్పేస్వామి పాల్గొన్నారు.