Minister savitha క్రీడల్లోనూ వైసీపీ అవినీతి
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:13 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో ‘ఆడుదాం.. ఆధ్ర’ తదితరాల ద్వారా క్రీడల్లో సైతం అక్రమాలకు పాల్పడిన పార్టీ వైసీపీ అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత మండిపడ్డారు. క్రీడలను జాతీయస్థాయికి తీసుకెళ్లిన ఘనత కూటమికి దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు.

పెనుకొండ టౌన, మార్చి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో ‘ఆడుదాం.. ఆధ్ర’ తదితరాల ద్వారా క్రీడల్లో సైతం అక్రమాలకు పాల్పడిన పార్టీ వైసీపీ అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత మండిపడ్డారు. క్రీడలను జాతీయస్థాయికి తీసుకెళ్లిన ఘనత కూటమికి దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం వ్యాయామశాల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. శాప్ నిధులతో వ్యాయామ శాల నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రధాన్యమిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వైసీపీ పాలనలో ఆడుదాం.. ఆంధ్రలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వాటిపై విచారణ సాగుతోందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో అధికారులు నాయకులు కేశవయ్య, గుట్టూరు సూరి, కన్వీనర్ శ్రీరాములు పాల్గొన్నారు.