Anganwadi అంగనవాడీ కేంద్రం వద్ద నిరసన
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:33 AM
మండలంలోని గాజులవారిపల్లి పెద్దతండా అంగనవాడీ కేంద్రం వద్ద గ్రామస్థులు శనివారం అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు.

గాండ్లపెంట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని గాజులవారిపల్లి పెద్దతండా అంగనవాడీ కేంద్రం వద్ద గ్రామస్థులు శనివారం అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. అంగనవాడీ కార్యకర్త పోస్టు కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. అందులో శోభారాణిని ఈనెల 18న నియమించారు. శోభారాణి తనతోపాటు దరఖాస్తు చేసుకున్నవారు తన విధుల్లో ఏమైన ఇబ్బందులు కలిగిస్తారని భావించి.. కోర్టు నుంచి మిగిలిన ఆ ముగ్గురు దరఖాస్తుదారులకు ముందస్తు నోటీసులు పంపించింది. ఇలాంటి నోటీసులు తాము ఎప్పుడూ చూడలేదని, తమను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలా నోటీసులు పంపారని ఆ దరఖాస్తుదారులు వాపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు శనివారం రాత్రి ఆ అంగనవాడీ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. ఇలాంటి అంగనవాడీ కార్యకర్త తమకు వద్దన్నారు.