Share News

plats అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:16 AM

స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో 650-2లో అర్హులైన ప్లంబర్స్‌కు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు డిమాండ్‌ చేశారు. ఈ

 plats  అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలి
ధర్నా నిర్వహిస్తున్న ప్లంబర్లు, సీపీఐ నాయకులు

ధర్మవరం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో 650-2లో అర్హులైన ప్లంబర్స్‌కు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. అనర్హుల పట్టాలను తొలగించి అర్హులైన ప్లంబర్‌ కార్మికులకు ఇవ్వాలని, లేకుంటే ఈనెల 24న ధర్నా చేపడుతామని అన్నారు. 850-2లో అక్రమాలపై విచారణ చేపట్టి అనర్హులుగా తెలితే వాటిని కూడా రద్దు చేయాలన్నారు. డీటీ సురేశబాబు మాట్లాడుతూ.. పూర్తీ విచారణ అనంతరం అర్హులైన ప్లంబర్స్‌కు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్‌, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పోలా లక్ష్మీనారాయణ, సంఘం అధ్యక్షుడు రాజు, కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆంజనేయులు, తాజ్‌, చిన్నా పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:16 AM