Share News

INVESTIGATION: ఎంజీఎం పాఠశాల హెచఎంపై విచారణ

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:18 AM

ఎంజీఎం పాఠశాల హెచఎం సామ్రాజ్యంపై గతంలో కొందరు చేసిన ఫిర్యాదులపై డీవైఈఓ పద్మప్రియ విచారణ అధికారిగా గురువారం పాఠశాలకు వచ్చారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, విద్యాశాఖ మంత్రి పేషీ నుంచి డీఈఓకు ఆదేశాలు అందగా ఆయన డీవైఈఓకు బాధ్యతలు అప్పగించినట్లు ఆమె తెలిపారు.

INVESTIGATION: ఎంజీఎం పాఠశాల హెచఎంపై విచారణ
DYEO Padmapriya talking to teachers

హిందూపురం అర్బన, మార్చి 20 (ఆంధజ్ర్యోతి): ఎంజీఎం పాఠశాల హెచఎం సామ్రాజ్యంపై గతంలో కొందరు చేసిన ఫిర్యాదులపై డీవైఈఓ పద్మప్రియ విచారణ అధికారిగా గురువారం పాఠశాలకు వచ్చారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, విద్యాశాఖ మంత్రి పేషీ నుంచి డీఈఓకు ఆదేశాలు అందగా ఆయన డీవైఈఓకు బాధ్యతలు అప్పగించినట్లు ఆమె తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లు ఎవరు చేస్తారు? ఆ సమయంలో కమిటీ ఏదైనా వేశారా, 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు జరిగినపుడు విద్యార్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేశారు? పాఠశాలలో చెట్లు తొలగించారా? తొలగిస్తే దానిని ఏ విధంగా తొలగించారు? ఎవరి అనుమతులు తీసుకొని తొలగించారు, వాటిని ఏ విధంగా వినియోగించారు, విద్యా సంవత్సరంలో స్టూడెంట్‌ కిట్లు అందరికీ అందాయా, అందలేదని ఏ విద్యార్థి నుంచి అయినా ఫిర్యాదులు వచ్చినాయా. అంటూ పలు ప్రశ్నలను పేపర్‌లో రాసి అందులో ఉపాధ్యాయులతో వారి అభిప్రాయాలు సేకరించారు. అదే విధంగా హెచఎం స్టూడెంట్‌ కిట్లు అమ్ముకున్నారు, చెట్లు నరికించి అమ్ముకున్నారు, టీసీలకు విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేశారుని ఫిర్యాదులు అందాయని, వాటిపై కూడా అభిప్రాయాలు తెలియజేయాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. దీనిపై ఉపాధ్యాయులు ఎవరికి వారు లిఖితపూర్వకంగా పేపర్‌లో రాసి ఇచ్చారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం:

పద్మప్రియ, డీవైఈఓ

హెచఎంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు వచ్చాను. డీఈఓ ఆదేశాలతో ఉపాధ్యాయుల నుంచి వారి అభిప్రాయాలు లిఖిత పూర్వకంగా సేకరించాను. ఆ నివేదికలు ఉన్నతాధికారులకు పంపుతాను.

Updated Date - Mar 21 , 2025 | 12:18 AM