hospital ఆదివారం ఆస్పత్రికి సెలవా..?
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:27 AM
తనకల్లు మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొక్కంటిలో ఉంది. ఈ కేంద్రంలో పనిచేసే సిబ్బంది సమయ పాలన పాటించదు. ఇక ఆదివారం వస్తే.. వైద్యుడు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన అసలు విధులకే రారనే ఆరోపణలున్నాయి.

తనకల్లు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): తనకల్లు మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొక్కంటిలో ఉంది. ఈ కేంద్రంలో పనిచేసే సిబ్బంది సమయ పాలన పాటించదు. ఇక ఆదివారం వస్తే.. వైద్యుడు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన అసలు విధులకే రారనే ఆరోపణలున్నాయి. ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సులు మాత్రమే విధుల్లో ఉంటారు. ఈ ఆదివారం డాక్టర్ ధర్మరాజు ఇలా వచ్చారు... ప్రసవం చేశారు.. అలా వెళ్లిపోయారు... ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన అసలు విధులకే రాలేదు. ఇక స్టాఫ్‌నర్సే అంతా తామై వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ఈ లోపం కారణంగా గ్రామాల్లోని ఆసుపత్రుల్లోని కిందిస్థాయి సిబ్బందీ.. విధులను నిర్లక్ష్యం చేస్తు న్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిఽధులు స్పందించి.. ప్రజలకు సక్రమంగా.,.. నిత్యం వైద్య సేవలు అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.