Share News

CPM: రాషా్ట్రభివృద్ధిని విస్మరించిన కేంద్రం

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:10 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల్‌ సీతారామన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున మండిపడ్డారు.

CPM: రాషా్ట్రభివృద్ధిని విస్మరించిన కేంద్రం
CPM leaders protesting

రాయదుర్గంరూరల్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల్‌ సీతారామన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున మండిపడ్డారు. శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ స్థానిక వినాయక కూడలి నుంచి పాత మున్సిపల్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఏపీ పట్ల బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకులు నాగరాజు, మధు, తిమ్మరాజు, కృష్ణనాయక్‌, ఆంజనేయులు, తిప్పేస్వామి, ఎస్‌ఎ్‌ఫఐ వంశీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:10 AM