Kunal Kamra: కునాల్ కామ్రాకు నోటీసులు, గడువు కోరిన స్టాండప్ కమెడియన్
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:58 PM
కునాల్‌పై కేసు నమోదు కావడంతో దర్యాప్తులో భాగంగా నోటీసులు పంపినట్టు పోలీసులు ధ్రువీకరించారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల కునాల్ ఇటీవల జరిగిన ఒక షోలో షిండే రాజకీయ ప్రయాణంపై సెటైర్లు విసిరారు.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra) వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం ముదురుతోంది. షిండేను 'ద్రోహి'గా పేర్కొంటూ కునాల్ చేసి వ్యాఖ్యలపై ఆయనకు ముంబై పోలీసులు మంగళవారంనాడు నోటీసులు పంపారు. అయితే విచారణకు ముందుకు హాజరయ్యేందుకు తనకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ ఆయన ఒక లేఖను పోలీసులకు అందజేశారు.
Kangana Ranaut: 2 నిమిషాల ఫేమ్ కోసమే ఇదంతా.. కునాల్‌పై కంగన మండిపాటు
కునాల్‌పై కేసు నమోదు కావడంతో దర్యాప్తులో భాగంగా నోటీసులు పంపినట్టు పోలీసులు ధ్రువీకరించారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల కునాల్ ఇటీవల జరిగిన ఒక షోలో షిండే రాజకీయ ప్రయాణంపై సెటైర్లు విసిరారు. షిండేను 'ద్రోహి'తో పోలుస్తూ 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ సాంగ్‌లోని చరణాలను పారడీ చేసి అవమానకర రీతిలో కునాల్ పాడారు. శివసేన, ఎన్‌సీపీలో ఇటీవల వచ్చిన చీలికలపైనా జోక్స్ వేశారు. దీంతో ఆగ్రహానికి గురైన శివసేన కార్యకర్తలు ఖార్ ప్రాంతంలోని కునాల్ షో నిర్వహించిన హాబిటాల్ కామెడీ క్లబ్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. షిండేను అవమానించారంటూ ఖార్ పోలీసు స్టేషన్‌లో శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కామెడీ వెన్యూను ధ్వంసం చేసిన 40 మంది శివసేన కార్యకర్తలను పోలీసులపై కేసు నమోదు చేయగా, శివసేన నేత రాహుల్ కనాల్, మరో 11 మందిని అరెస్టు చేశారు. అదే రోజు వారికి స్థానిక కోర్టు బెయిలు మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి..