Share News

Kadiri భగతసింగ్‌కు ఘననివాళి

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:31 AM

స్వాతంత్ర సమరయోధుడు భగతసింగ్‌ వర్ధంతిని స్థానిక ఎస్‌టీఎ్‌సఎన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు.

Kadiri భగతసింగ్‌కు ఘననివాళి
కదిరి : భగతసింగ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సిబ్బంది

కదిరిఅర్బన, మార్చి 23(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర సమరయోధుడు భగతసింగ్‌ వర్ధంతిని స్థానిక ఎస్‌టీఎ్‌సఎన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ స్మిత మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో భగతసింగ్‌, అల్లూరి సీతారామరాజు, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు తదితర వందలాది మంది తృణప్రాయంగా ప్రాణాలు అర్పించారని, వారి సిద్ధాంతాలను నేటి యువత అనుసరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు చెన్నారెడ్డి, డాక్టర్‌ హైదర్‌వలీ, శంకర్‌, నస్రీన, రవీంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:31 AM