Rabi Season Drought: కరువు గుప్పిట 51 మండలాలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:00 AM
ఆంధ్రప్రదేశ్‌లో రబీ సీజన్‌లో వర్షాభావం కారణంగా 51 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37 తీవ్ర కరువు, 14 మధ్యస్థ కరువు మండలాలుగా గుర్తించి, సంబంధిత సహాయ చర్యలకు జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది

6 జిల్లాల పరిధిలో గుర్తింపు
37 మండలాల్లో తీవ్రం, 14 చోట్ల మధ్యస్థం
నోటిఫికేషన్ జారీ
అమరావతి, మార్చి31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రబీ సీజన్‌లో వర్షాభావం నెలకున్న ఆరు జిల్లాల్లోని 51 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37 తీవ్ర కరువు, 14 మధ్యస్థ కరువు మండలాలుగా గుర్తించారు. సోమవారం ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తీవ్ర కరువు మండలాల జాబితాలో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల; శ్రీసత్యసాయిజిల్లా రొద్దం; కర్నూలుజిల్లా ఆస్పిరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి; అనంతపురం జిల్లా బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాడికి; ప్రకాశంజిల్లా పుల్లలచెరువు, దొనకొండ, కురిచేడు,మర్రిపూడి, కంభం, తర్లుపాడు, పెద్దారవీడు, సంతనూతలపాడు, ఒంగోలు, వెలిగండ్ల, బెస్తవారిపేట; కడప జిల్లా దువ్వూరు, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, కాశినాయన, ఖాజీపేట,చాపాడు,ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తొండూరు ఉన్నాయి.
మధ్యస్థ కరువు మండలాలుగా పత్తికొండ (కర్నూలు); విడపనకల్లు (అనంతపురం); మైలవరం (కడప); తనకల్లు (శ్రీసత్యసాయి జిల్లా);బేతంచర్ల, బనగానపల్లి, సంజామల,ఉయ్యాలవాడ (నంద్యాలజిల్లా); కొనకనమిట్ల, మార్కాపురం, చీమకుర్తి, చంద్రశేఖరపురం, పామూరు, రాచర్ల (ప్రకాశం జిల్లా) ఉన్నాయి. ఈ మండలాల రైతులు రుణ సౌకర్యం పొందటానికి, ఇతర సహాయ కార్యకలాపాలు చేపట్టడానికి వీలుగా జిల్లాల గజెట్లు ప్రకటించి, తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.