Share News

Mnister Satyakumar Yadav: 175 నియోజకవర్గాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:04 AM

సీఎం చంద్రబాబు నాయకత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని 175 నియోజక..

Mnister Satyakumar Yadav: 175 నియోజకవర్గాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు

సత్తెనపల్లి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయకత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లో పీపీపీ పద్ధతిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఆదివారం పల్నా డు జిల్లా సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో అదనపు భవనాన్ని ఆయన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలసి ప్రారంభించారు. సత్తెనపల్లిలోని రాజుపాలెం మండలంలో వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 300 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల ను త్వరలో భర్తీ చేసి, డాక్టర్ల కొరత తీరుస్తామన్నారు.


క్యాన్సర్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తోందన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 03:04 AM