Chandrababu Govt: క్రీడాకారులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Feb 06 , 2025 | 06:14 PM
AP Sports Persons: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ప్రోత్సాహక నిధులను విడుదల చేసింది.

అమరావతి, ఫిబ్రవరి 06: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితోపాటు శాప్ చైర్మన్ రవినాయుడు విజ్ఞప్తితో క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. క్రీడాకారులకు ప్రోత్సహకాలు విడుదల చేయడంపై శాప్ చైర్మన్ రవి నాయుడు గురువారం అమరావతిలో విలేకర్లతో మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో రూ.11,68,62,288 క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ ప్రోత్సాహకాలు అందక దాదాపు 224 మంది రాష్ట్రంలోని క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
189 మంది క్రీడాకారులకు రూ.7,96,62,289 నగదును కూటమి ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిందన్నారు. క్రీడాకారులకు ప్రోత్సహకాలు విడుదల చేయడంతో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్‌కు శాప్ చైర్మన్ రవి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. ప్రోత్సహకాలు విడుదల చేయడంపై క్రీడాకారులతోపాటు క్రీడా సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని క్రీడాకారుల సమస్యలను ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి రవి నాయుడు తీసుకు వెళ్లిన విషయం విధితమే.
గత వైసీపీ ప్రభుత్వంలో క్రీడాకారులకు ఎటువంటి ప్రోత్సహాకాలు అందజేయలేదు. దీంతో వందలాది మంది క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్న్నారు. ఇక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆడుదాం ఆంధ్ర పేరుతో అట్టహసంగా క్రీడలను ఏర్పాటు చేశారు. క్రీడాకారుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అందుకోసం భారీగా నిధులు సైతం కేటాయించారు. కానీ ఇది సైతం అంతగా సక్సెస్ కాలేదు. అంతేకాదు.. ఇందులో భారీ కుంభకోణం చోటు చేసుకుందంటూ ఆరోపణలు సైతం వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత
For AndhraPradesh News And Telugu News