Share News

నేడు, రేపు రిజిస్ట్రేషన్‌, జీఎస్టీ కార్యాలయాలు పనిచేస్తాయి

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:33 AM

రిజిస్ట్రేషన్‌-స్టాంపుల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు ఈనెల 30, 31 తేదీలలో పనిచేస్తాయని సంబంధిత శాఖల అధికారులు శ్రీరామ్‌ కుమార్‌, జాన్‌స్టీవెన్‌సన్‌ శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

నేడు, రేపు రిజిస్ట్రేషన్‌, జీఎస్టీ కార్యాలయాలు పనిచేస్తాయి

తిరుపతి, మార్చి29(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌-స్టాంపుల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు ఈనెల 30, 31 తేదీలలో పనిచేస్తాయని సంబంధిత శాఖల అధికారులు శ్రీరామ్‌ కుమార్‌, జాన్‌స్టీవెన్‌సన్‌ శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వచ్చేనెల 2నుంచి తిరుపతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ నిమిత్తం స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి చేశామని శ్రీరామ్‌కుమార్‌ తెలిపారు. కాగా ఆర్థిక సంవత్సరం ముగింపు దృష్ట్యా జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలు చేయాల్సిన వారు రెండు రోజులు వినియోగించుకోగలరని జీఎస్టీ జేసీ జాన్‌స్టీవెన్‌సన్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 02:33 AM