Share News

కాలం చెల్లిన మందుల విక్రయం

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:41 AM

పుత్తూరు పట్టణంలోని ఆరు మెడికల్‌ షాపుల్లో గురువారం తిరుపతి డివిజన్‌ డ్రగ్స్‌ అధికారిణి రీతు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందుల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో మూడు షాపులను సీజ్‌ చేశారు.

కాలం చెల్లిన మందుల విక్రయం

డ్రగ్స్‌ అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన వైనం

మూడు షాపుల సీజ్‌

హోమియో మందుల షాపుపై కేసు నమోదు

పుత్తూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పుత్తూరు పట్టణంలోని ఆరు మెడికల్‌ షాపుల్లో గురువారం తిరుపతి డివిజన్‌ డ్రగ్స్‌ అధికారిణి రీతు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందుల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో మూడు షాపులను సీజ్‌ చేశారు. ఈ షాపుల్లో బిల్లులు ఇవ్వకుండా విక్రయించడం, ఫార్మసిస్టు లేకపోవడం, కాలం చెల్లిన మందులను విక్రయించడాన్ని గుర్తించారు. అదేవిధంగా షణ్ముగన్‌ హోమియో మెడికల్‌ షాపులో అనుమతులు లేని మూడు రకాల మందులను విక్రయిస్తుండటాన్ని గుర్తించారు. ఈ దుకాణంపై కేసు నమోదు చేసి కోర్టుకు నివేదించనున్నట్లు రీతు తెలిపారు. వీఆర్‌వో యశోద, ప్రభుత్వ ఫార్మాసిస్టు అన్నాదొరైలు ఆమెకు సహకరించారు.

Updated Date - Mar 28 , 2025 | 01:41 AM