Share News

మహిళా పారిశ్రామికవేత్తలదే భవిష్యత్తు

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:53 AM

మహిళా పారిశ్రామికవేత్తలదే భవిష్యత్తు అని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పంలో అలీప్‌ ఆధ్వర్యంలో మహిళలకు ఆరు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంభించారు.

మహిళా పారిశ్రామికవేత్తలదే భవిష్యత్తు
అలీప్‌ శిక్షణ సమావేశంలో ప్రసంగిస్తున్న భువనేశ్వరి

- నారా భువనేశ్వరి

కుప్పం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మహిళా పారిశ్రామికవేత్తలదే భవిష్యత్తు అని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పంలో అలీప్‌ ఆధ్వర్యంలో మహిళలకు ఆరు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా తనకూ అలీ్‌పకూ ఎంతో అనుబంధముందన్న భువనేశ్వరి ఈ సంస్థ తన ముందే చిన్నమొక్కగా ఏర్పడి, మహావృక్షమైందని చెప్పారు. అలీప్‌ చైర్‌పర్సన్‌ రమాదేవి చాలాకాలంగా తెలుసని, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడంలో ఈ సంస్థకు ఎంతో అనుభవముందన్నారు.మహిళలు అనుకుంటే సాధించలేనిది లేదన్నదానికి తానే ఒక ఉదాహరణ అని చెప్పారు. ‘గృహిణిగా వున్న నన్ను చంద్రబాబు హెరిటేజ్‌కు ఎండీని చేశారు. నేను ఎవరి దగ్గరా శిక్షణ పొందలేదు. నాకు నేనుగా నేర్చుకుని ముందుకు సాగుతున్నా’ అని స్వయం అనుభవాన్ని వివరించారు. పట్టుదల పడితే, మగాళ్లకంటే ఎక్కువగా పనిచేసే శక్తి మహిళలకే ఉందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకోసం కుప్పంలో అలీప్‌ ఏర్పాటు కాబోతున్నదని, ఇందుకోసం చంద్రబాబు 20 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కడా ఆధ్వర్యంలో కేటాయించారని గుర్తు చేశారు. దీనిద్వారా మహిళలు ఎందరో శిక్షణ పొంది, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారన్నారు.‘నాకు ఐఏఎస్‌ అధికారులతో మాట్లాడే అలవాటు లేదు. కానీ మీకోసం నేను కడా పీడీ వికాస్‌ మర్మత్‌గారితో తరచూ మాట్లాడుతున్నా.మా కుప్పం మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఆయన ఏమేం చేస్తున్నారో, చేయగలరో అడిగి తెలుసుకుంటున్నా’ అని భువనేశ్వరి చెప్పారు. కుప్పం పరిధిలో పెద్ద పరిశ్రమలతోపాటు చిన్నతరహా పరిశ్రమలు కూడా రాబోతున్నాయన్నారు. ఆయా పరిశ్రమలను మహిళలే స్థాపించాలని, వాటిలో కుప్పం నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించాలని భువనేశ్వరి ఆకాక్షించారు. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం మాట్లాడుతూ అలీప్‌ ద్వారా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న శిక్షణ అద్భుతాలు సృష్టిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కడా పీడీ వికాస్‌ మర్మత్‌ మాట్లాడుతూ అలీప్‌ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రీమ్‌ ప్రాజెక్టు అన్నారు. శిక్షణ పొంది తర్వాత ఏదో ప్రాజెక్ట్‌ పెట్టేశామంటే ఎదగలేరని, దానికి ముందు సమగ్ర సర్వే చేసి ప్రాజెక్ట్‌ ఏర్పాటు, వ్యయం, మనదగ్గరున్న బడ్జెట్టు, భవిష్యత్తులో పొందబోయే లాభాలు వంటివన్నిటి గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుని మరీ ముందడుగు వేయాలని సూచించారు. కుప్పంలో త్వరలోనే అలీప్‌ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ పార్కు తీసుకొస్తామని చెప్పారు. అలీప్‌ చైర్‌పర్సన్‌ రమాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి పిలుపుతో ఇక్కడ మహిళలను సాధికారత దిశగా నడిపించడానికి ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినందుకు ప్రభుత్వానికి, కడా పీడీకి ఆమె ఽకృత్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, అలీప్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 01:53 AM