Mounjaro Injection: మధుమేహం, ఊబకాయానికి కొత్త ఇంజెక్షన్
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:27 AM
కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) అనుమతితో సింగిల్ డోస్ వయల్ రూపంలో ఈ ఇంజెక్షన్‌ను విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. దీన్ని వైద్యులు సిఫారసు చేసిన మోతాదు ప్రకారం వారానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది.

మార్కెట్లోకి తెచ్చిన ఎలీ లిల్లీ ఇండియా
2.5 ఎంజీ ధర రూ.3,500.. 5 ఎంజీకి
రూ.4,375.. వారానికి ఒకటి చాలు
ఇంజెక్షన్‌తో పాటు ఆహార నియంత్రణ, వ్యాయామం తప్పనిసరి
న్యూఢిల్లీ, మార్చి 20: ఉబకాయం, మధుమేహంతో బాధపడేవారికి శుభవార్త! ఆ రెండింటికీ పనిచేసే ‘మౌంజారో’ అనే ఔషధాన్ని ఎలీ లిల్లీ ఇండియా సంస్థ గురువారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) అనుమతితో సింగిల్ డోస్ వయల్ రూపంలో ఈ ఇంజెక్షన్‌ను విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. దీన్ని వైద్యులు సిఫారసు చేసిన మోతాదు ప్రకారం వారానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే టిర్జెపటైడ్ అనే ఔషధం.. మన శరీరంలో ఉండే జీఐపీ (గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టైడ్), జీఎల్‌పీ-1 (గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్-1) అనే హార్మోన్ గ్రాహకాలను ఉత్తేజితం చేస్తుందని, తద్వారా మధుమేహం, ఊబకాయం, అధికబరువును అదుపులో ఉంచుతుందని కంపెనీ తన ప్రకటనలో వివరించింది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా.. ఆహార నియంత్రణ పాటిస్తూ, వ్యాయామం చేస్తూ ఈ ఔషధాన్ని వారానికి 15 మిల్లీగ్రాముల చొప్పున తీసుకున్నవారు 72 వారాల వ్యవధిలో సగటున 21.8 కిలోల బరువు తగ్గారని.. 5ఎంజీ చొప్పున తీసుకున్నవారు సగటున 15.4 కిలోల బరువు తగ్గారని వెల్లడించింది. మన దేశంలో ఈ ఔషధం ధర 2.5 మిల్లీగ్రాముల వయల్ రూ.3,500. అదే 5 మిల్లీ గ్రాముల వయల్ అయితే రూ.4,375. వైద్యులు సిఫారసు చేసిన మోతాదును బట్టి ఖర్చు ఉంటుంది. ఉదాహరణకు.. వారానికి 2.5 ఎంజీ తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.14 వేలు ఖర్చవుతుంది. అదై 5ఎంజీ తీసుకోవాలంటే నెలకు రూ.17,500 అవుతుంది. ఇవే మోతాదుల్లో ఈ ఔషధాన్నిఅమెరికాలో కొనాలంటేనెలకు రూ.86 వేల నుంచి రూ.లక్ష దాకా ఖర్చవుతుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..