కొత్త దుస్తులు కొన్నా.. కళ్లు తెరమ్మా!
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:09 AM
అనపర్తి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): త్వరలో పుట్టినరోజు జరుపుకోవలసిన చిన్నారిని కాలువ రూపం లో మృత్యువు కబళించింది. తూర్పుగోదావరి జిల్లా అ

కాలువలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
తట్టుకోలేక విలవిల్లాడిన తల్లి
అనపర్తి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): త్వరలో పుట్టినరోజు జరుపుకోవలసిన చిన్నారిని కాలువ రూపం లో మృత్యువు కబళించింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలోని నల్లకాలువలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన మచ్చ అనూషాభార్గవి (4) అదృశ్యమైంది. తల్లిదండ్రులు దొరబాబు, భవానీ వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుమంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సిబ్బంది పాప నివాసం ఉండే సమీపంలోని కాలువ వెంబడి గాలింపు చేపట్టగా సాయంత్రం చింతపల్లి లాకుల వద్ద పాప మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాప ఆడుకుంటూ కాలువలోకి జారి పడి ఉంటుందని భావిస్తున్నట్టు సీఐ తెలిపారు. మే నెల 28న పుట్టినరోజు జరుపుకునేందుకు చిన్నారికి కొత్త దుస్తులు కూడా కొన్నానని, తాను ఇప్పుడు ఎవరికి పుట్టినరోజు ఎవరికి చేయాలంటూ చిన్నారి తల్లి భవాని రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.