అవినీతి.. ‘లక్ష’ణాలు!
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:06 AM
మొన్న పిఠాపురం రూరల్ ఎస్‌ఐ.. నేడు కాకినాడ జిల్లా సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్.. వరుసగా అవినీతి ముసుగు వేసుకున్న లంచావతరాల గుట్టు బయటపడడం కాకినాడ జిల్లాలో సంచలనమైంది.

మొన్న పిఠాపురం రూరల్ ఎస్‌ఐ.. నేడు కాకినాడ జిల్లా సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్.. వరుసగా అవినీతి ముసుగు వేసుకున్న లంచావతరాల గుట్టు బయటపడడం కాకినాడ జిల్లాలో సంచలనమైంది.
కాకినాడలో ఏసీబీకి చిక్కిన
జిల్లా రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్..
గ్యాస్ ఏజెన్సీ యజమాని
పేరు మార్పునకు రూ.లక్ష డిమాండ్
ఏసీబీని ఆశ్రయించిన
ఏజెన్సీ యజమాని
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న
ఏసీబీ అధికారులు
ఇటీవలే ఏసీబీకి చిక్కిన
పిఠాపురం రూరల్ సీఐ
28కెకెడి 9, 10, 11
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
మొన్నటికి మొన్న ఏసీబీ వలకు పోలీసు అవినీతి తిమింగలం చిక్కింది.. తాను ప్రైవేటుగా పెట్టుకున్న డ్రైవర్ ద్వారా రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్‌ఐ ఎల్.గుణశేఖర్ ఈ నెల 24వ తేదీ రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకే మరో భారీ అవినీతి తిమింగలం కాకినాడ జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల వలకు పట్టుబడింది. కాకినాడ జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఈ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. అవినీతి సొమ్ముకు అలవాటు పడిన కొందరు లంచాలు డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు వరుసగా పట్టుబడడం సంచలనమైంది.
భారీ అవినీతి తిమింగలం..
కాకినాడ జిల్లా రిజిస్ర్టార్ అనగానే ఆదాయం భారీగా ఉంటుంది. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడికి వివిధ పనుల నిమిత్తం క్రయవిక్రయదారులు అధికంగా వస్తుంటారు. జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు, సబ్ రిజిస్ర్టార్‌లు ఇక్కడ విధులు నిర్వర్తిస్తుంటారు. ఇక్కడ డాక్యుమెంట్ రైట ర్లు కూడా ఎక్కువే. నిత్యం వీరంతా కార్యాలయంలోనే నేరుగా తమ పనులు చక్కబెట్టుకుంటారు. మరోవైపు సిబ్బంది కూడా చాలామంది ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టవేశారు. అవినీతికి అల వాటు పడ్డారు. రోజువారీ టార్గెట్లు పెట్టుకుని చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఇక జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు విషయాని కొస్తే.. ఈయన సొసైటీ, ఫర్మ్, ఎడిట్ ఇండెక్స్(తప్పుల సవరణ, పోస్టు ఫ్యాక్టో పనులు, పవర్ వాల్యూషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తనిఖీ ఈయన పని.. జిల్లాలోనే ఆయన గత కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆడిట్ అండ్ మార్కెట్ రిజిస్ట్రార్‌గా రెండేళ్లపాటు కాకినాడలో పనిచేశారు. అన ంతరం ఇక్కడి నుంచి బదిలీపై రాజమండ్రి వెళ్లిపోయారు... 2024 ఆగస్టులో బదిలీపై తిరిగి కాకినాడ వచ్చారు.
రూ.లక్ష డిమాండ్ చేసిన రిజిస్ట్రార్..
తన భార్య పేరున ఉన్న గ్యాస్ ఏజెన్సీని తన పేరున పార్టనర్ షిప్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ వచ్చిన తునికి చెందిన ఆర్.రమేష్‌బా బు నుంచి రూ.లక్ష డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కాడు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు. ఆయనతో పాటు మరో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీశ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తునికి చెందిన ఆర్.రమేష్‌బాబు తన భా ర్య పేరున ఉన్న సమతా గ్యాస్ ఏజెన్సీని కొన్ని కారణాలతో తన పేరున మార్చుకోవాలని, పార్టనర్‌షిప్ డీడ్‌ను రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను జిల్లా రిజి స్ర్టార్ ఆనందరావును ఆశ్రయించాడు. ఆ పని చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని ఆనందరావు డి మాండ్ చేశాడు. 15 రోజులుగా ఈ వ్యవహారం సాగుతుండగా రమేష్‌బాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు సిద్ధమయ్యా రు. శుక్రవారం కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన రమేష్‌బాబు లంచం సొమ్మును ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆనందరావు నుంచి రూ.లక్ష, సీనియ ర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి నుంచి రూ.25 వేలు, అనధికారికంగా ఉన్న మరో రూ.85వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌బాబు తెలిపారు.
కారులో నగదు, ఖరీదైన మద్యం సీసాలు, స్వాధీనం
ఏసీబీకి పట్టుబడిన కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె.ఆనందరావును ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి విచారించారు. ఆయన కారులో సుమారు రూ.7.80లక్షల నగదు, ఖరీదైన 13 మద్యం సీసాల ను గుర్తించారు. వీటిని కాకినాడ ఇంద్రపాలెంలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ఆనందరావు పై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకు విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరంల్లో భారీ భవంతులు ఉన్నట్టు సమాచారం.
డిప్యూటీ సీఎం ఇలాకాలో...
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెం దిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ రూరల్ ఎస్‌ఐ గుణశేఖర్, అతడి పోలీసు వాహనంపై ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ ఏసీబీ అధికారులకు చిక్కారు. 2024 అక్టోబర్ నెలలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో జిల్లా స్థాయి అధికారుల విచారణ అనంతరం పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, గంగరాజులను నిర్దోషులుగా గుర్తించారు. వారి పేర్లను కేసు నుంచి తొ లగించేందుకు రూరల్ ఎస్‌ఐ గుణశేఖర్ లం చడం డిమాండ్ చేసి 20 రోజులుగా తిప్పుతున్నారు. బేరసారాల అనంతరం రూ.20 వేలకు అంగీకారం తెలిపి.. ఆ సొమ్ము తీసుకుంటుండగా గుణశేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో జరిగిన ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అయితే దీనిపై డిప్యూటీ సీఎం వపన్‌కల్యాణ్ స్పందించా రు. ప్రజలను ఇబ్బంది పెట్టే నేరస్తులతో పాటు వారికి అండగా ఉండే నాయకులు, పోలీసులను ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో శాంతి భద్రతల అంశంపై అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు పోలీసు స్టేషన్లలో పరిస్థితిపై ఇంటిలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు.