Share News

అమ్మానుషం!

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:48 AM

అమ్మ నులివెచ్చని పొతిళ్లలో ఉండాల్సిన చిన్నారిని వద్దని విసిరేయడంతో.. కుక్క లు పీక్కుతిన్న విషాదఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో మంగళవారం చోటుచేసుకుంది.

అమ్మానుషం!
కుక్కల దాడిలో గాయాలపాలైన చిన్నారి

కుక్కలు పీక్కుతిన్న వైనం

ఆసుపత్రికి తరలింపు

నల్లజర్ల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అమ్మ నులివెచ్చని పొతిళ్లలో ఉండాల్సిన చిన్నారిని వద్దని విసిరేయడంతో.. కుక్క లు పీక్కుతిన్న విషాదఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో మంగళవారం చోటుచేసుకుంది. పోతవరం-యర్నగూడెం రోడ్డులో పొగా కు బ్యారన్ల దగ్గర ఉన్న ముళ్లపొదల్లో ముక్కపచ్చలారని ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు.ఉదయం పాలు తీసుకురావాడానికి అటుగా వెళ్తున్న రైతులు శిశువును కు క్కలు పీక్కుతినడం చూసి విస్తుపో యారు. వెంటనే కుక్కలను తరిమికొట్టి శిశువును కాపాడి వైద్యసిబ్బందికి సమాచారం అందించారు.ఈ మేరకు ఏఎన్‌ ఎం మహాలక్ష్మి,గ్రామ సంరక్షణ అధికారి దీపిక సంఘటనా స్థలానికి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న శిశువును తీసుకుని వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం డాక్టర్‌ రాజశేఖర్‌ శిశువును పరిశీలించి మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూ రు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి రక్తం ఎక్కించారు.నల్లజర్ల సీఐ వై.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లిన సీఐ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీడీపీవో నాగలక్ష్మి, ఏసీడీపీవో పద్మావతి, సూపర్‌వైజర్‌ వెంకటలక్ష్మి ఏలూరు వెళ్లి శిశువును పరిశీలించి సంరక్షణ కోసం ఇద్దరి ఆయాలను అక్కడ ఉంచారు. మరో 48 గంటలు దాటితే తప్ప ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపిన ట్టు సీడీపీవో నాగలక్ష్మి తెలిపారు.

Updated Date - Mar 26 , 2025 | 12:48 AM