సామర్లకోటలో ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:13 AM
సామర్లకోట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కుమార రామ భీమేశ్వరా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఆదివారం కాకినాడ జిల్లా సామర్లకోట ఉండూరు ఎన్‌ఎఫ్‌సీఎల్ పైప్‌లైన్ రోడ్డులో ఉత్సాహంగా నిర్వహించారు. వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్‌గా ఈ పోటీలను నిర్వహించగా మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా

సీనియర్స్‌లో విజేతగా గుమ్మిలేరు,
జూనియర్స్‌లో సామర్లకోట ఎడ్లు
సామర్లకోట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కుమార రామ భీమేశ్వరా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఆదివారం కాకినాడ జిల్లా సామర్లకోట ఉండూరు ఎన్‌ఎఫ్‌సీఎల్ పైప్‌లైన్ రోడ్డులో ఉత్సాహంగా నిర్వహించారు. వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్‌గా ఈ పోటీలను నిర్వహించగా మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప పోటీలను తిలకించి విజేతలకు బహు మతులు అందజేశారు. 4 కిలోమీటర్లు వెళ్లి వచ్చేందుకు నిర్వహించిన పోటీల్లో సీనియర్స్ విభాగంలో ప్రథమ స్థానాన్ని గుమ్మిలేరుకు చెందిన కోరా శృతిచౌదరికి చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో అన కాపల్లి అర్జనగిరికి చెందిన పరవన్నాయుడి ఎ డ్లు, తృతీయ స్థానంలో గుమ్మిలేరుకు చెందిన ఎడ్లు నిలిచి బహుమతులు సాధించాయి. సీని యర్స్ విభాగంలో 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి.
జూనియర్స్ విభాగంలో సామర్లకోట వల్లూరి సత్యేంద్రకుమార్‌కు చెందిన ఎడ్లు ప్రథమ స్థా నం, ద్వితీయ స్థానంలో వడిశలేరు సిద్దివినా యక శ్రీనివాసుకు చెందిన ఎడ్లు, తృతీయ స్థానంలో గాడాల మద్దాల శ్రీనుకు చెందిన ఎ డ్లు, నాల్గోస్థానంలో వెల్దుర్తి మొగలి ఏసుబాబు కు చెందిన ఎడ్లు, ఐదోస్థానంలో సామర్లకోట వల్లూరి సత్యేంద్రకుమార్‌కు చెందిన ఎడ్లు నిలిచి బహుమతులు సాధించాయి. జూనియర్స్ విభా గంలో మొత్తం 25 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పోటీల నిర్వాహకులు కంటే జగదీష్‌మోహన్, వల్లూరి దొరబాబు తదితర కమిటీ ప్రతినిధుల చేతుల మీదుగా ఎమ్మెల్యేను సత్కరించారు.