Share News

కడుపునింపని ఉపాధి!

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:52 AM

జిల్లా లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూ లీలకు వేతనాలు నిలిచిపోయాయి. సుమారు రెండు నెలలకు పైగా వారికి కూలీ అందడం లేదు.

కడుపునింపని ఉపాధి!
ఉపాధి కూలీలు

రెండు నెలలగా అందని వేతనాలు

రూ. 11.70 కోట్ల బకాయిలు

నేటికీ అకౌంట్లకు జమకాని వైనం

లబోదిబోమంటున్న కూలీలు

గోకవరం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూ లీలకు వేతనాలు నిలిచిపోయాయి. సుమారు రెండు నెలలకు పైగా వారికి కూలీ అందడం లేదు. దీంతో ఆ కుటుంబాల వారికి పోషణ కరువై ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికి అందుతాయో అధికారులు ఖచ్చితంగా చెప్ప లేకపోతున్నారు. 15 రోజుల్లో వేతనాలు చెల్లిం చాలనే నిబంధనలు ఉన్నా అధికారులు మా త్రం పట్టించుకోవడంలేదు. జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం లక్షా 26 వేల మంది జాబ్‌కార్డుదారులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 15,472 మంది ఉపాధి పనికి వెళుతున్నారు. ఇంత వరకు సుమారు రూ.11.70 కోట్లు బకా యిలు కూలీలకు చెల్లించాల్సి ఉంది. మరో రూ.46.42 కోట్లు మెటీరియల్‌ బకాయిలు రావాల్సి ఉంది. చివరి సారిగా ఈ ఏడాది జన వరి మొదటి వారంలో కూలీలకు వేతనాలు చెల్లింపులు జరిగాయి. ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి వారి బ్యాంక్‌ ఖాతాలో జమకాలేదు. రెండు నెలలుగా అందకపోవ డంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లేక.. ఉపాధి వేత నం అందక లబోదిబోమంటున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొస్తున్నారు. కొందరు కూలీలైతే ఉపాధి వేతనాలు వచ్చాక చెల్లించే స్తామంటూ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి కుటుంబాలను పోషిస్తున్న ఘటనలు ఉంటున్నాయి. గోకవరం మండ లంలో 11,183 మందికి జాబ్‌ కార్డులు ఉండగా వీరిలో సరాసరి రోజుకు 1200 నుంచి 1300 మంది వరకు ఉపాధి పనులకు వెళుతున్నారు. ఇప్పటి వరకు 1246 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు పూర్తయినట్టు ఉపాధి హామీ పఽథకం అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం పనికి వస్తున్న కూలీలకు వేతనాలు అందడంలేదు.మండలంలో ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్‌,మినీ గోకులాలు తదితర పను లు జరుగుతున్నాయి.ప్రభుత్వం నుంచి నిధు లు విడుదల కాగానే కూలీల ఖాతాల్లోకి జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:52 AM