Share News

అమ్మా నేను మోసపోయా..

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:59 AM

అమ్మా నా గురించి బెంగపెట్టుకో వద్దు.. నేను దారుణం గా మోసపోయా..ఒక ఫంక్షన్‌కి రెడ్‌ కలర్‌ శారీ కట్టుకుని వెళ్లి వాడికళ్లలో పడ్డా..ఆ ఫంక్షన్‌కి రెడ్‌ కలర్‌ శారీ కట్టుకుని వెళ్లకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే ఈ రోజు సంతోషంగా ఉండేదానిని.. వాడు తనను మోసం చేశాడని.. తనకు మరణం తప్పవేరే దారి కనిపించడం లేదు.. నా కోసం ఆలోచించవద్దు..చెల్లికి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయండి.. తాను మరణించాక తన అవయవాలను దానం చేయాలని.. తన చెల్లికి తాను మళ్లీ పాపగా పుడతానని ఒక వైద్య విద్యార్థిని డైరీలో రాసుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది.

అమ్మా నేను మోసపోయా..
కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు

  • ఫార్మ్‌డీ ఫైనలియర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

  • రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేనిలో ఘటన

  • ఆసుపత్రి కోఆర్డినేటర్‌ దీపక్‌ వేధింపులే కారణమని ఆరోపణ

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అమ్మా నా గురించి బెంగపెట్టుకో వద్దు.. నేను దారుణం గా మోసపోయా..ఒక ఫంక్షన్‌కి రెడ్‌ కలర్‌ శారీ కట్టుకుని వెళ్లి వాడికళ్లలో పడ్డా..ఆ ఫంక్షన్‌కి రెడ్‌ కలర్‌ శారీ కట్టుకుని వెళ్లకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే ఈ రోజు సంతోషంగా ఉండేదానిని.. వాడు తనను మోసం చేశాడని.. తనకు మరణం తప్పవేరే దారి కనిపించడం లేదు.. నా కోసం ఆలోచించవద్దు..చెల్లికి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయండి.. తాను మరణించాక తన అవయవాలను దానం చేయాలని.. తన చెల్లికి తాను మళ్లీ పాపగా పుడతానని ఒక వైద్య విద్యార్థిని డైరీలో రాసుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వికాస్‌ ఫార్మసీ కళాశాల పార్మ్‌డి ఫైనలియర్‌ విద్యార్థిని నల్లపు అంజలి (23) ఆత్మహత్యాయత్నం తీవ్రసంచలనం కలిగించింది. తోటి విద్యార్థినులను కదిలిచింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మం డలం రౌతుగూడెం గ్రామానికి చెందిన అంజలి రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి వద్ద వికాస్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్‌ డి పైనలియర్‌ చదువుతుంది. గత ఆరునెలలుగా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెల 23న ఆసుపత్రిలో అంజలి ఎనస్థీషియా అత్యధిక డోస్‌ ఇంజక్షన్‌ చేసుకుని కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెతో కలిసి పనిచేసే సహచర సిబ్బంది గమనించి వెంటనే ఐసీయూలోకి తరలించి వైద్యం అందిం చారు. అయితే పరిస్థితి విషమించినా విషయం బయటకు రాకుండా ఆసుపత్రి వర్గా లు జాగ్రత్తపడ్డాయి. అయితే ఆమె డైరీలో రాసుకున్న సూసైడ్‌ లెటర్‌ బయటకు రావడంతో అంజలి తల్లిదండ్రులు, బంధువుల, కళాశాల విద్యార్థినులు, విద్యార్థి సంఘాలు మంగళవారం రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బొల్లినేని ఆసుపత్రిని ముట్టడించి ధర్నా చేశాయి. అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణ మైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో మెడికల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తు న్న దీపక్‌ ఆమెను వేధించి అవసరాలు తీర్చుకుని ఇదే విషయాన్ని మరికొంత మందికి చెప్పి వేధింపులకు గురిచేయ డంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రాసిన లేఖలో కూడా తాను అనుభవించిన దారుణ సంఘటనలు వివరించింది. సంఘటన స్థలాన్ని ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీలు రమేష్‌ బాబు, భవ్యకిషోర్‌ పర్యవేక్షించారు. అంజలి తండ్రి నల్లపు దుర్గారావు ఫిర్యాదు మేరకు ప్రకాష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించం

విషయం తెలుసుకున్న రాజానగరం, రాజ మహేంద్రవరం ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి వాసు ఆసుపత్రికి చేరుకుని అంజలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు.ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం అం జలి తల్లి,చెల్లిని పరామర్శించారు.ఈ ఘటనకు కారణమైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని.. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించేదిలేదన్నారు.అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తొలుత ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు మాజీ ఎంపీ భరత్‌రామ్‌ మద్దతుగా నిలిచారు.

Updated Date - Mar 26 , 2025 | 12:59 AM