భూసంస్కరణలు అమలు చేయాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:51 AM
రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేసి సిలింగు చట్టప్రకారం 50శాతం భూమి ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారుడు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమం డ్రి ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారుడు అయినాపురపు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 20(ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేసి సిలింగు చట్టప్రకారం 50శాతం భూమి ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారుడు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమం డ్రి ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,349 ఎకరాల సీలింగ్ మిగులు భూములు ఉన్నా యని వాటిలో 15,500 ఎకరాలు పంపిణీ జరిగిందని అప్పటి తూ ర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సీసీఎస్‌యూ నివేదిక పంపారని తెలిపారు. సుమారు 18848 ఎకరాలు కోర్టులో వివాదంలో ఉన్నాయని కోనేరు రంగారావు భూ కమిటీ నివేదించిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో పంచిన సీలింగ్ భూములు వెయ్యి ఎకరాల లోపే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగ్ భూ ములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్స్ జరుగకుండా 22ఎ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న 18,848 ఎకరాల విషయమై సత్వర చర్యలు తీసుకొని కోర్టు లిటికేషన్ నుంచి తప్పించి పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రౌతులపూడి మండలంలో 50 ఏళ్లుగా వివాదంలో ఉందని, అయితే తహశీల్దార్ డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో మంజూరు చేశారని, దానిపై ప్రభుత్వం విచారణ జరిపి తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలుత ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడు, భారత రాజ్యాంగ సభ సభ్యుడు జైపాల్‌సింగ్ ముండా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళుల ర్పించారు. సమావేశంలో ఆదివాసీ మహాసభ సభ్యులు జక్కల పాండవులు, గూన అప్పన్న, అర్జన్న, మల్లేశ్వరి, చీడిపల్లి లక్ష్మణ, గొలగాని నూకాలమ్మ, చంద్రావతి పాల్గొన్నారు.