Share News

అభివృద్ధే కూటమి ధ్యేయం

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:32 AM

అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన సాగిస్తోందని ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సోమవారం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్వయం ఉపాధి పథకం కింద రుణాలు అందించి వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.

అభివృద్ధే కూటమి ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోరంట్ల

  • ప్రతిఒక్కరి సొంతింటి కల సాకారానికి కృషి

  • కడియం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల

కడియం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన సాగిస్తోందని ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సోమవారం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్వయం ఉపాధి పథకం కింద రుణాలు అందించి వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. జూన్‌ మొదటి వారంలో తల్లికి వందనం పథకం ఇస్తా మన్నారు. కడియంలో ఉన్న చిన్నపాటి ఇబ్బందులు తొలగిన వెంటనే ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నా రు. రాబోవు వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దుళ్ల ఎర్ర కాలనీలో తాగునీటి ట్యాంక్‌ నిర్మాణానికి అడ్డం కులు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులకు సూచించారు. ఎంపీటీసీ సభ్యుడు గిరజాల బాబు మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజలకు విద్యుత్‌ కష్టాలు లేకుండా చూడాలన్నారు. కడియంలో బొబ్బిలి వంతెనను పునఃనిర్మించాలని సభ దృష్టికి తీసుకెళ్లారు. దా మిరెడ్డిపల్లి ఉపసర్పంచ్‌ ముద్రగడ జమీ మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ కలిదిండి విశాలాక్షి, సర్పంచ్‌లు అన్నందేవుల చంటి, యాదల స్టా లిన్‌, కొండపల్లి పట్టియ్య, ఇన్‌చార్జి సర్పంచ్‌ పా టంశెట్టి రాంజీ, ఎంపీటీసీలు నాగిరెడ్డి రామకృష్ణ, ఉపసర్పంచ్‌లు వెలుగుబంటి నాని, పాతూరి రాజేష్‌ పాల్గొన్నారు. అంతకుముందు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేగదూడల ప్రదర్శనను ఎమ్మెల్యే గోరంట్ల తిలకించారు. విజేతలైన దూడలకు చెందిన రైతులకు బహుమతులు అందజేశారు.

Updated Date - Mar 25 , 2025 | 12:32 AM