Share News

ప్రజల దాహార్తి తీర్చేందుకు చర్యలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:15 AM

ముమ్మిడివరం నగర పంచాయతీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు రూ.161.56 కోట్లు మంజూరు చేసింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కృషితో నిధులు మంజూరయ్యాయి.

ప్రజల దాహార్తి తీర్చేందుకు చర్యలు

ముమ్మిడివరం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ముమ్మిడివరం నగర పంచాయతీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు రూ.161.56 కోట్లు మంజూరు చేసింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కృషితో నిధులు మంజూరయ్యాయి. దీంతో మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వంటి వాటిని నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి నిధులు మంజూరయ్యాయి. దీంతో నగర పంచాయతీ స్థలం సేకరణకు సంబంధించి రెవెన్యూశాఖను కోరడంతో అమలాపురం ఆర్డీవో కె.మాధవి సోమవారం ముమ్మిడివరం నగర పంచాయతీ 20వ వార్డు మట్టాడిపాలెంలోని గతంలో ప్రభుత్వం సేకరించిన స్థలాన్ని పరిశీలించారు. స్థలం మంజూరుకు సంబంధించిన ప్రతిపాదన రూపొందించి నివేదించాల్సిందిగా తహశీల్దార్‌ ఎంవీఎస్‌ లక్ష్మిని ఆదేశించారు. స్థలం సేకరణకు సంబంధించిన విషయాలను మంచినీటి ప్రాజెక్టు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వివరాలను ఆర్డీవో కె.మాధవి కమిషనర్‌ పి.రవివర్మతో చర్చించారు. వారి వెంట ఏఈ పీవీ సుధాకర్‌, డీటీ బి.గోపాలకృష్ణ, టీపీవో రాజేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 01:15 AM